మహా పాదయాత్రను విజయవంతం చేయాలి
బీజేపీ సిద్దిపేట జిల్లా అధ్యక్షుడు బైరి శంకర్ ముదిరాజ్ పిలుపు హుస్నాబాద్, నవంబర్ 21 (చైతన్యగళం): ఈ నెల 23న కరీంనగర్ పార్లమెంట్ పరిధిలో నిర్వహించనున్న మహా పాదయాత్రను విజయవంతం చేయాలని బీజేపీ సిద్దిపేట జిల్లా అధ్యక్షుడు బైరి శంకర్ ముదిరాజ్ పార్టీ కార్యకర్తలకు పిలుపునిచ్చారు. మహా పాదయాత్ర నేపథ్యంలో శనివారం హుస్నాబాద్ పట్టణంలోని బి.ఎల్. రెడ్డి ఫంక్షన్ హాల్‌లో బీజేపీ హుస్నాబాద్ మండల ముఖ్య కార్యకర్తల సమావేశం నిర్వహించారు. మండల అధ్యక్షుడు భూక్య సంపత్ నాయక్ అధ్యక్షతన జరిగిన ఈ సమావేశానికి ముఖ్య...