జాతీయ పత్రికా దినోత్సవం సందర్భంగా సీనియర్ పాత్రికేయులకు ఘన సన్మానం
మహబూబాబాద్‌లో సోమ పురుషోత్తం, శ్రీరామ్ ప్రసాద్‌లకు సత్కారం మహబూబాబాద్, నవంబర్ 16 (చైతన్యగళం): జాతీయ పత్రికా దినోత్సవాన్ని పురస్కరించుకుని మహబూబాబాద్ జిల్లా కేంద్రానికి చెందిన సీనియర్ పాత్రికేయులను శ్రీ లక్ష్మీ వెంకటేశ్వర సేవా ట్రస్ట్ ఆధ్వర్యంలో ఘనంగా సన్మానించారు. ఈ సందర్భంగా దూరదర్శన్ (డీడీ న్యూస్) జిల్లా స్టాఫర్ సోమ పురుషోత్తం, అరుణప్రభ న్యూస్ రిపోర్టర్ శ్రీరామ్ ప్రసాద్‌లకు ట్రస్ట్ ప్రతినిధులు శాలువాలు కప్పి, పుష్పగుచ్ఛాలు అందజేసి సత్కరించారు. ఈ సందర్భంగా ట్రస్ట్ ప్రతినిధులు మాట్లాడుతూ సమాజంలో జరుగుతున్న పరిణామాలను ప్రజలకు చేరవేయడంలో పాత్రికేయుల...