Thursday, November 12, 2026
Homeతెలంగాణఓటుతోనే కాంగ్రెస్‌, బీఆర్ఎస్‌, బీజేపీలకు బుద్ధి చెప్పాలి

ఓటుతోనే కాంగ్రెస్‌, బీఆర్ఎస్‌, బీజేపీలకు బుద్ధి చెప్పాలి

📰 Generate e-Paper Clip

  • పట్టభద్రుల ఎమ్మెల్సీ ఎన్నికల్లో యువత కీలక పాత్ర పోషించాలి.. కల్వకుంట్ల కవిత పిలుపు

హైదరాబాద్‌, నవంబర్ 11 (చైతన్యగళం):

కాంగ్రెస్‌ ప్రభుత్వం అధికారంలోకి వచ్చిన తర్వాత ప్రజా సమస్యలపై ఎన్ని పోరాటాలు చేసినా ఆశించిన మార్పు రావడం లేదని తెలంగాణ రక్షణ సేన అధ్యక్షురాలు కల్వకుంట్ల కవిత విమర్శించారు. ప్రభుత్వాల పనితీరులో మార్పు తీసుకురావాలంటే ఓటు ద్వారా ప్రజలు తమ తీర్పు ఇవ్వాలని పిలుపునిచ్చారు. బుధవారం హైదరాబాద్‌లో మీడియాతో మాట్లాడుతూ త్వరలో జరగనున్న రెండు పట్టభద్రుల ఎమ్మెల్సీ ఎన్నికల్లో యువత, విద్యావంతులు చురుకుగా పాల్గొనాలని కోరారు.

రాష్ట్రంలో సుమారు నాలుగు కోట్ల జనాభా ఉండగా, పట్టభద్రుల సంఖ్య గణనీయంగా ఉందని కవిత పేర్కొన్నారు. అర్హులైన ప్రతి ఒక్కరూ పట్టభద్రుల ఓటరుగా నమోదు చేసుకోవాలని సూచించారు. తమ ఓటు ద్వారా కాంగ్రెస్‌, బీఆర్ఎస్‌, బీజేపీ పార్టీలకు ప్రజలు తమ అభిప్రాయాన్ని తెలియజేయవచ్చన్నారు. రాజకీయ నేపథ్యం లేని యువతకు కూడా రాజకీయాల్లో అవకాశాలు కల్పించాల్సిన అవసరం ఉందని అభిప్రాయపడ్డారు.

కాంగ్రెస్‌ పార్టీ ఎమ్మెల్సీ ఎన్నికల్లో రూ.200 కోట్లు ఖర్చు చేసి గెలవాలని ప్రయత్నిస్తోందని కవిత ఆరోపించారు. యువత డబ్బులకు ప్రలోభపడకుండా తమ భవిష్యత్తును దృష్టిలో పెట్టుకుని ఓటు వేయాలని సూచించారు. ప్రజా సమస్యలు, నిరుద్యోగం, విద్య, ఉద్యోగ అవకాశాలపై రాజకీయ పార్టీలు సమాధానం చెప్పాల్సిన అవసరం ఉందన్నారు. తెలంగాణ ప్రజలు తమ పార్టీకి మద్దతు ఇవ్వాలని కోరారు.

రాష్ట్రంలోని 77 నియోజకవర్గాల్లో ప్రచార కార్యక్రమాలు నిర్వహించనున్నట్లు పేర్కొన్న కవిత, బుధవారం నుంచి అధికారికంగా ఎన్నికల ప్రచారాన్ని ప్రారంభించినట్లు వెల్లడించారు. తమ పార్టీ అభ్యర్థులకు వీరతిలకం దిద్ది ఎన్నికల బరిలోకి దింపుతున్నామని వ్యాఖ్యానించారు. తమతో కలిసి వచ్చే పార్టీలతో కలసి ఎన్నికల్లో ముందుకు సాగుతామని తెలిపారు. తెలంగాణ రక్షణ సేన పార్టీకి ఎన్నికల సంఘం గుర్తింపు ఉందని పేర్కొంటూ, రిజిస్ట్రేషన్‌కు సంబంధించి కొన్ని అభ్యంతరాలు వచ్చినప్పటికీ వాటిని త్వరలో పరిష్కరించుకుంటామని కవిత వెల్లడించారు.

RELATED ARTICLES
- Advertisment -

Most Popular

App Icon

Install CG News App

Add to home screen for faster loading and latest updates.

error: Content is protected !!