హైదరాబాద్ నవంబర్ 10(చైతన్యగళం):
తెలంగాణ రాష్ట్ర వైద్య ఆరోగ్య శాఖలో మరో 2,929 ఖాళీల భర్తీకి ప్రభుత్వం చర్యలు చేపట్టింది. ఇందులో 996 పోస్టుల భర్తీకి ఆర్థిక శాఖ ఇప్పటికే అనుమతులు మంజూరు చేయగా, మిగిలిన 1,933 పోస్టులకు అనుమతులు రావాల్సి ఉంది. సివిల్ అసిస్టెంట్ సర్జన్లు, నర్సులు, అసిస్టెంట్ ప్రొఫెసర్ల వంటి కీలక పోస్టులను భర్తీ చేసేందుకు అధికారులు సన్నాహాలు చేస్తున్నారు. మెడికల్ రిక్రూట్మెంట్ బోర్డు, తెలంగాణ పబ్లిక్ సర్వీస్ కమిషన్ ద్వారా నియామక ప్రక్రియ చేపట్టేందుకు కసరత్తు జరుగుతోంది.
