- రాష్ట్రవ్యాప్తంగా ఫెడరేషన్ ఆధ్వర్యంలో 1,600 వాటర్ ప్లాంట్ల నిర్వహణ
హుస్నాబాద్, నవంబర్ 4 (చైతన్యగళం):
గ్రామీణ ప్రాంతాల ప్రజలకు నాణ్యమైన, స్వచ్ఛమైన తాగునీటిని అందించడమే బాలవికాస సంస్థ ప్రధాన లక్ష్యమని బాలవికాస వాటర్ ప్లాంట్స్ ఫెడరేషన్ రాష్ట్ర అధ్యక్షుడు కేడం లింగమూర్తి తెలిపారు. ఫెడరేషన్ ఆధ్వర్యంలో నిర్వహించిన బాలవికాస వాటర్ ప్లాంట్ల సిద్దిపేట జోన్ సమైక్య జోనల్ సమావేశం సిద్దిపేటలో జరిగింది. ఈ కార్యక్రమానికి ఆయన ముఖ్య అతిథిగా హాజరయ్యారు.
ఈ సందర్భంగా కేడం లింగమూర్తి మాట్లాడుతూ రాష్ట్రవ్యాప్తంగా ఫెడరేషన్ ఆధ్వర్యంలో సుమారు 1,600 వాటర్ ప్లాంట్లు నిర్వహిస్తున్నట్లు వెల్లడించారు. సిద్దిపేట జోన్‌కు చెందిన 55 గ్రామాల వాటర్ ప్లాంట్ల కమిటీ సభ్యులు ఈ సమావేశంలో పాల్గొన్నారని తెలిపారు. గ్రామీణ ప్రాంతాల్లో ప్రజలకు తాగునీటి ఇబ్బందులు తలెత్తకుండా వాటర్ ప్లాంట్ల ద్వారా స్వచ్ఛమైన నీటిని అందించేందుకు సంస్థ నిరంతరం కృషి చేస్తోందన్నారు.
ప్రజల భాగస్వామ్యంతో బాలవికాస సంస్థ సేవలను మరింత విస్తృతం చేస్తామని పేర్కొన్నారు. ప్రతి గ్రామంలో స్వచ్ఛమైన తాగునీటి సౌకర్యం అందుబాటులో ఉండేలా సంస్థ తన వంతు బాధ్యతను నిర్వర్తిస్తుందని తెలిపారు.
ఈ సమావేశంలో జోనల్ డైరెక్టర్లు రామలింగారెడ్డి, లక్ష్మీనారాయణ, సిద్దిరాములు, ఐలేని మల్లికార్జున్‌రెడ్డి, బాలవికాస సంస్థ మేనేజర్ మధుసూదన్, డైరెక్టర్లు, సంస్థ అధికారులు, వివిధ గ్రామాల వాటర్ ప్లాంట్ల కమిటీ సభ్యులు తదితరులు పాల్గొన్నారు.
