ప్రజలకు నాణ్యమైన తాగునీరు అందించడమే బాలవికాస లక్ష్యం

రాష్ట్రవ్యాప్తంగా ఫెడరేషన్‌ ఆధ్వర్యంలో 1,600 వాటర్‌ ప్లాంట్ల నిర్వహణ హుస్నాబాద్‌, నవంబర్‌ 4 (చైతన్యగళం): గ్రామీణ ప్రాంతాల ప్రజలకు నాణ్యమైన, స్వచ్ఛమైన తాగునీటిని అందించడమే బాలవికాస సంస్థ ప్రధాన లక్ష్యమని బాలవికాస వాటర్‌ ప్లాంట్స్‌ ఫెడరేషన్‌ రాష్ట్ర అధ్యక్షుడు కేడం లింగమూర్తి తెలిపారు. ఫెడరేషన్‌ ఆధ్వర్యంలో నిర్వహించిన బాలవికాస వాటర్‌ ప్లాంట్ల సిద్దిపేట జోన్‌ సమైక్య జోనల్‌ సమావేశం సిద్దిపేటలో జరిగింది. ఈ కార్యక్రమానికి ఆయన ముఖ్య అతిథిగా హాజరయ్యారు. ఈ సందర్భంగా కేడం లింగమూర్తి మాట్లాడుతూ రాష్ట్రవ్యాప్తంగా ఫెడరేషన్‌ ఆధ్వర్యంలో సుమారు 1,600...