Tuesday, October 20, 2026
Homeఆంధ్రప్రదేశ్అక్రమ మద్యం రవాణాపై ఉక్కుపాదం!

అక్రమ మద్యం రవాణాపై ఉక్కుపాదం!

📰 Generate e-Paper Clip

  • ఎన్నికల వేళ ఎక్సైజ్‌ నిఘా ముమ్మరం.. బ్రాహ్మణకొట్కూరు సమీపంలో విస్తృత తనిఖీలు

నందికొట్కూరు, అక్టోబర్‌ 19 (చైతన్యగళం):

రాబోయే స్థానిక సంస్థల ఎన్నికల నేపథ్యంలో అక్రమ మద్యం రవాణాను అరికట్టేందుకు ఎక్సైజ్‌ అధికారులు నిఘా ముమ్మరం చేశారు. ఇందులో భాగంగా నందికొట్కూరు మండలం బ్రాహ్మణకొట్కూరు సమీపంలో ఆదివారం రాత్రి విస్తృతంగా వాహన తనిఖీలు నిర్వహించారు.

జిల్లా ఎక్సైజ్‌ అధికారి సాధు రవికుమార్‌ ఆదేశాల మేరకు ఎస్‌ఐ హరిత ఆధ్వర్యంలో అనుమానాస్పద వాహనాలను క్షుణ్ణంగా తనిఖీ చేశారు. ఎన్నికలు ప్రశాంతంగా, నిష్పక్షపాతంగా జరిగేలా నిఘా పెంచినట్లు నందికొట్కూరు ఎక్సైజ్‌ సీఐ రామాంజనేయులు తెలిపారు. అక్రమంగా మద్యం రవాణా చేస్తే కఠిన చర్యలు తీసుకుంటామని హెచ్చరించారు.

RELATED ARTICLES
- Advertisment -

Most Popular

App Icon

Install CG News App

Add to home screen for faster loading and latest updates.

error: Content is protected !!