ఎమ్మెల్యే నాగరాజు విజన్‌పై విమర్శలు హాస్యాస్పదం -నకరకంటి మోహన్ గౌడ్

3,500 ఇందిరమ్మ ఇళ్ల నిర్మాణమే అభివృద్ధికి నిదర్శనం.. గత పాలనపై బహిరంగ చర్చకు సిద్ధమా? వర్ధన్నపేట ప్రతినిధి , అక్టోబర్ 13 (చైతన్యగళం): ప్రజల సంక్షేమం,అభివృద్ధి, పేదలకు అండగా నిలవడమే నిజమైన నాయకత్వానికి కొలమానమని, కేవలం విమర్శలు చేయడం, రాజకీయ ఆరోపణలు గుప్పించడమే విజన్‌కు నిర్వచనం కాదని ఐనవోలు మండల కాంగ్రెస్ పార్టీ అధ్యక్షుడు నకరకంటి మోహన్ గౌడ్ అన్నారు. వర్ధన్నపేట ఎమ్మెల్యే కేఆర్ నాగరాజుకు విజన్ లేదంటూ మాజీ ఎమ్మెల్యే ఆరూరి రమేష్ చేసిన వ్యాఖ్యలపై ఆయన తీవ్రంగా స్పందించారు.ఎమ్మెల్యే నాగరాజు పనితీరును...