Tuesday, November 3, 2026
Homeతెలంగాణగోపా జిల్లా అధ్యక్షుడిగా వడ్లకొండ సుభాష్ గౌడ్ ఏకగ్రీవం

గోపా జిల్లా అధ్యక్షుడిగా వడ్లకొండ సుభాష్ గౌడ్ ఏకగ్రీవం

📰 Generate e-Paper Clip

  • ప్రధాన కార్యదర్శిగా తాళ్లపల్లి రమేష్ గౌడ్.. కోశాధికారిగా కంకటి ముక్తిశ్వర్ గౌడ్

మహబూబాబాద్(చైతన్యగళం): గౌడ అధికారుల, వృత్తిదారుల సంఘం (గోపా) మహబూబాబాద్ జిల్లా అధ్యక్షుడిగా వడ్లకొండ సుభాష్ గౌడ్ ఏకగ్రీవంగా ఎన్నికయ్యారు. ప్రధాన కార్యదర్శిగా తాళ్లపల్లి రమేష్ గౌడ్, కోశాధికారిగా కంకటి ముక్తిశ్వర్ గౌడ్ ఎన్నికయ్యారు.

మహబూబాబాద్‌లోని లయన్స్ క్లబ్‌లో జిల్లా అధ్యక్షుడు కుర్ర శ్రీనివాస్ గౌడ్ అధ్యక్షతన జరిగిన జిల్లా సర్వసభ్య సమావేశంలో నూతన కమిటీని ఏకగ్రీవంగా ఎన్నుకున్నారు. అనంతరం రాష్ట్ర బాధ్యులు నూతన కమిటీతో ప్రమాణ స్వీకారం చేయించారు.

ఈ సందర్భంగా రాష్ట్ర గోపా అధ్యక్షుడు బండి సాయన్న గౌడ్, ఉపాధ్యక్షుడు ముద్దగొని రామ్మోహన్ గౌడ్ మాట్లాడుతూ జిల్లా కమిటీ ఏకగ్రీవంగా ఎన్నిక కావడం పట్ల గౌడ బంధుమిత్రులకు అభినందనలు తెలిపారు. సర్దార్ సర్వాయి పాపన్న గౌడ్ ఆశయాలను స్ఫూర్తిగా తీసుకుని గౌడ సమాజం ఐక్యతతో ముందుకు సాగాలని పిలుపునిచ్చారు.

నూతన అధ్యక్షుడు వడ్లకొండ సుభాష్ గౌడ్ మాట్లాడుతూ జిల్లా స్థాయిలో గౌడ సోదరులకు ఏ సమస్య వచ్చినా అండగా నిలుస్తామని తెలిపారు. విద్యను ప్రోత్సహిస్తూ ప్రతిభావంతులైన విద్యార్థులకు పురస్కారాలు అందజేస్తామని, సామాజిక సేవా కార్యక్రమాలను మరింత విస్తృతం చేస్తామని అన్నారు.

కార్యక్రమంలో రాష్ట్ర గోపా బాధ్యులు బిక్కి వెంకటేశ్వర్లు, చీకటి శ్రీనివాస్ గౌడ్, ముత్యం వెంకన్న గౌడ్, మాచర్ల రమేష్ గౌడ్, రవీందర్ గౌడ్, సమ్మెట వెంకన్న గౌడ్ తదితరులు పాల్గొన్నారు.

RELATED ARTICLES
- Advertisment -

Most Popular

App Icon

Install CG News App

Add to home screen for faster loading and latest updates.

error: Content is protected !!