గోపా జిల్లా అధ్యక్షుడిగా వడ్లకొండ సుభాష్ గౌడ్ ఏకగ్రీవం

ప్రధాన కార్యదర్శిగా తాళ్లపల్లి రమేష్ గౌడ్.. కోశాధికారిగా కంకటి ముక్తిశ్వర్ గౌడ్ మహబూబాబాద్(చైతన్యగళం): గౌడ అధికారుల, వృత్తిదారుల సంఘం (గోపా) మహబూబాబాద్ జిల్లా అధ్యక్షుడిగా వడ్లకొండ సుభాష్ గౌడ్ ఏకగ్రీవంగా ఎన్నికయ్యారు. ప్రధాన కార్యదర్శిగా తాళ్లపల్లి రమేష్ గౌడ్, కోశాధికారిగా కంకటి ముక్తిశ్వర్ గౌడ్ ఎన్నికయ్యారు. మహబూబాబాద్‌లోని లయన్స్ క్లబ్‌లో జిల్లా అధ్యక్షుడు కుర్ర శ్రీనివాస్ గౌడ్ అధ్యక్షతన జరిగిన జిల్లా సర్వసభ్య సమావేశంలో నూతన కమిటీని ఏకగ్రీవంగా ఎన్నుకున్నారు. అనంతరం రాష్ట్ర బాధ్యులు నూతన కమిటీతో ప్రమాణ స్వీకారం చేయించారు. ఈ సందర్భంగా...