- కార్యక్రమాన్ని ప్రారంభించిన సర్పంచ్ మ్యాకల స్వర్ణలత–సురేందర్‌రెడ్డి
కోహెడ, అక్టోబరు 1 (చైతన్యగళం): మండలంలోని తీగలకుంటపల్లి గ్రామ పాఠశాలలో విద్యార్థులకు అల్పాహారం పంపిణీ కార్యక్రమాన్ని సర్పంచ్ మ్యాకల స్వర్ణలత–సురేందర్‌రెడ్డి ప్రారంభించారు. తెలంగాణ ప్రభుత్వం చేపట్టిన ఈ కార్యక్రమం ద్వారా విద్యార్థులకు ప్రతిరోజూ పౌష్టికాహారం అందించడంతోపాటు వారి ఆరోగ్యం, విద్యాభ్యాసానికి ప్రయోజనం చేకూరేలా చర్యలు తీసుకుంటున్నట్లు తెలిపారు.
తెలంగాణ ప్రభుత్వం, హరేకృష్ణ ఫౌండేషన్ సహకారంతో విద్యార్థులకు నాణ్యమైన, పౌష్టికమైన అల్పాహారం అందించడం అభినందనీయమని సర్పంచ్ పేర్కొన్నారు. విద్యార్థులు ఆరోగ్యంగా ఉంటేనే చదువులో మరింతగా రాణించగలరని, అల్పాహార కార్యక్రమాన్ని సద్వినియోగం చేసుకోవాలని సూచించారు.
కార్యక్రమంలో ఉపసర్పంచ్ రాగుల మహేష్, వార్డు సభ్యులు రేవోజు శంకర్, పెరుగు సంజీవరెడ్డి, పాఠశాల ఉపాధ్యాయురాలు త్రివేణి, పాఠశాల చైర్మన్ కొమ్మిడి శారద, గ్రామస్తులు, విద్యార్థులు పాల్గొన్నారు.
