- లయన్స్ క్లబ్ ఆధ్వర్యంలో మొక్కల నాటడం, వస్త్ర సంచుల పంపిణీ
కరీంనగర్, సెప్టెంబరు 28 (చైతన్యగళం): పర్యావరణ సేవా వారోత్సవంలో భాగంగా లయన్స్ క్లబ్ ఆఫ్ కరీంనగర్ ఆధ్వర్యంలో సోమవారం రామకృష్ణ కాలనీలోని శ్రీ రామచంద్ర మిషన్ ఆశ్రమంలో పలు పర్యావరణ, సామాజిక సేవా కార్యక్రమాలు నిర్వహించారు.
ఆశ్రమ ప్రాంగణంలో లయన్స్ సభ్యులు మొక్కలు నాటి పచ్చదనం పెంపొందించేందుకు కృషి చేశారు. ప్లాస్టిక్ కవర్ల వినియోగాన్ని తగ్గించాలనే ఉద్దేశంతో ఆశ్రమ సిబ్బందికి వస్త్ర సంచులను పంపిణీ చేశారు.
సమాజానికి విశిష్ట సేవలందించిన వైద్యుడు డా. రఘురామ్‌ను ఘనంగా సన్మానించారు. పర్యావరణ పరిరక్షణతో పాటు సామాజిక బాధ్యతపై అవగాహన కల్పించేందుకు ఇలాంటి కార్యక్రమాలు కొనసాగిస్తామని నిర్వాహకులు తెలిపారు.
