దానం నాగేందర్‌కు సుప్రీం షాక్
హైకోర్టు తీర్పులో జోక్యం ఉండదు.. పిటిషన్ కొట్టివేత ఢిల్లీ, సెప్టెంబరు 24 (చైతన్యగళం): ఖైరతాబాద్ మాజీ ఎమ్మెల్యే దానం నాగేందర్ అనర్హత వ్యవహారంలో సుప్రీంకోర్టు గురువారం కీలక తీర్పు వెలువరించింది. తెలంగాణ హైకోర్టు ఇచ్చిన తీర్పులో జోక్యం చేసుకునేందుకు నిరాకరిస్తూ దానం నాగేందర్ దాఖలు చేసిన పిటిషన్‌ను కొట్టివేసింది. ప్రధాన న్యాయమూర్తి జస్టిస్ సూర్యకాంత్, జస్టిస్ జోయ్‌మాల్య బాగ్చీ, జస్టిస్ వి.మోహనతో కూడిన త్రిసభ్య ధర్మాసనం విచారణ చేపట్టింది. దానం నాగేందర్ తరఫున సీనియర్ న్యాయవాది ముకుల్ రోహత్గీ వాదనలు వినిపించారు. నాగేందర్ తిరిగి...