కౌన్సిలర్‌ అభ్యర్థిత్వాన్ని పరిశీలించాలని బైరెడ్డి సిద్ధార్థరెడ్డికి ఆయిల్‌ షఫీ వినతి

నందికొట్కూరు, సెప్టెంబరు 22 (చైతన్యగళం): నందికొట్కూరు పట్టణంలోని 5వ వార్డు కౌన్సిలర్‌ అభ్యర్థిత్వాన్ని పరిశీలించాలని వైఎస్సార్‌సీపీ రాష్ట్ర యువజన విభాగం అధ్యక్షుడు బైరెడ్డి సిద్ధార్థరెడ్డిని ఆయిల్‌ షఫీ కోరారు. ఈ మేరకు మంగళవారం పట్టణంలోని వైఎస్సార్‌సీపీ కార్యాలయంలో కుటుంబ సభ్యులతో కలిసి బైరెడ్డి సిద్ధార్థరెడ్డిని మర్యాదపూర్వకంగా కలిశారు. ఈ సందర్భంగా ఆయిల్‌ షఫీ మాట్లాడుతూ.. వైఎస్సార్‌సీపీపై తనకు ఉన్న అభిమానంతో పార్టీ బలోపేతానికి నిరంతరం కృషి చేస్తున్నట్లు తెలిపారు. పార్టీ సిద్ధాంతాలు, నాయకత్వంపై తనకు పూర్తి విశ్వాసం ఉందన్నారు. 5వ వార్డు నుంచి కౌన్సిలర్‌గా...