Sunday, October 11, 2026
Homeతెలంగాణఅరవింద్‌ మృతి పార్టీకి తీరని లోటు

అరవింద్‌ మృతి పార్టీకి తీరని లోటు

📰 Generate e-Paper Clip

  • పార్థివదేహానికి తల్లోజు ఆచారి నివాళి

కల్వకుర్తి, సెప్టెంబర్‌ 19 (చైతన్యగళం‌): కల్వకుర్తి మండలం తర్ణికల్‌ గ్రామానికి చెందిన బీజేవైఎం మండల ప్రధాన కార్యదర్శి జంపుల అరవింద్‌ అకాల మృతి పట్ల బీజేపీ నేత, జాతీయ బీసీ కమిషన్‌ మాజీ సభ్యుడు తల్లోజు ఆచారి తీవ్ర దిగ్భ్రాంతి వ్యక్తం చేశారు. శనివారం అరవింద్‌ పార్థివదేహాన్ని సందర్శించి పుష్పాంజలి ఘటించి నివాళులర్పించారు. అనంతరం కుటుంబ సభ్యులను పరామర్శించి ప్రగాఢ సానుభూతి తెలిపారు.

అరవింద్‌ మృతి పార్టీకి, గ్రామానికి తీరని లోటని పేర్కొన్నారు. ఆయన ఆత్మకు శాంతి చేకూరాలని, కుటుంబ సభ్యులకు మనోధైర్యం ప్రసాదించాలని భగవంతుడిని ప్రార్థించారు. కార్యక్రమంలో బీజేపీ నాయకులు, కార్యకర్తలు పాల్గొని అరవింద్‌కు నివాళులర్పించారు.

RELATED ARTICLES
- Advertisment -

Most Popular

App Icon

Install CG News App

Add to home screen for faster loading and latest updates.

error: Content is protected !!