కరీంనగర్, సెప్టెంబర్ 18 (చైతన్య గళం):
జిల్లాలో ప్రభుత్వం నిర్దేశించిన లక్ష్యం మేరకు ఆయిల్‌ఫామ్ సాగును విస్తరించేలా అధికారులు సమన్వయంతో పనిచేయాలని జిల్లా కలెక్టర్ చిత్రా మిశ్రా సూచించారు. ఈ ఏడాది జిల్లాలో వెయ్యి ఎకరాల్లో ఆయిల్‌ఫామ్ సాగు చేపట్టేలా రైతులను ప్రోత్సహించాలని ఆదేశించారు. ఉద్యానవన, వ్యవసాయ శాఖల అధికారులు క్షేత్రస్థాయిలో రైతులకు అవగాహన కల్పించి, పంట సాగు ద్వారా కలిగే ప్రయోజనాలను వివరించాలని సూచించారు.
ఆయిల్‌ఫామ్ సాగు పురోగతిపై శుక్రవారం రాత్రి కలెక్టర్ తన ఛాంబర్‌లో ఉద్యానవన శాఖ జిల్లా అధికారి జగన్మోహన్‌రెడ్డి, ఆయిల్‌ఫెడ్ డిస్ట్రిక్ట్ మేనేజర్ చింతల రోహిత్, జిల్లా వ్యవసాయ అధికారి చత్రు నాయక్‌తో సమీక్ష నిర్వహించారు. మండలాల వారీగా సాగు విస్తీర్ణం, రైతులను ప్రోత్సహిస్తున్న విధానం, లక్ష్య సాధనకు తీసుకుంటున్న చర్యలను అడిగి తెలుసుకున్నారు.
ప్రతి ఏఈవోకు 25 ఎకరాల చొప్పున లక్ష్యాన్ని నిర్దేశించి రైతులను ప్రోత్సహించాలని ఆదేశించారు. గ్రామాల వారీగా రైతులతో సమావేశాలు నిర్వహించి ఆయిల్‌ఫామ్ సాగుపై అవగాహన కల్పించాలని సూచించారు. చిగురుమామిడి, సైదాపూర్ మండలాల్లో ప్రత్యేక కార్యాచరణ రూపొందించి ఒక్కో మండలంలో 50 ఎకరాల్లో ఆయిల్‌ఫామ్ సాగు జరిగేలా చర్యలు చేపట్టాలని ఆదేశించారు.
చిగురుమామిడి మండలంలో సుమారు 25 ఎకరాల్లో ఆయిల్‌ఫామ్ నర్సరీ ఏర్పాటు చేసేందుకు చర్యలు తీసుకుంటున్నట్లు కలెక్టర్ తెలిపారు. నర్సరీ ఏర్పాటుతో రైతులకు అవసరమైన మొక్కలు సులభంగా అందుబాటులోకి వస్తాయని పేర్కొన్నారు. ఆయిల్‌ఫామ్ సాగుతో మెరుగైన ఆదాయం పొందే అవకాశం ఉన్నందున రైతులను ఈ పంట వైపు మళ
