‘ఆత్మహత్యల’ రహిత భారత్ ను నిర్మిద్దాం
"సమస్యలనేవి జీవితంలో ఒక భాగం మాత్రమే .జీవితమే సమస్య కాదు. నిన్ను నువ్వు తక్కువ అంచనా వేసుకోకు.ధైర్యంగా ముందుకు సాగు " - స్వామి వివేకానంద మనిషి "జీవితంలో "అనుకున్న లక్ష్యాన్ని చేరుకోక పోవడం వల్ల తీవ్రఒత్తిడికి లోనై" ఆత్మహత్యలకు" పాల్పడటం ప్రపంచ మానవాళికి జటిల సామాజిక ప్రజారోగ్య సమస్యగా పరిణమించింది . "ప్రపంచ ఆరోగ్య సంస్థ" లెక్కల ప్రకారం ప్రపంచ వ్యాప్తంగా సగటున 7లక్షల మంది "ఆత్మహత్యలు" చేసుకుంటున్నారు. ఇందులో 15 నుండి 29 ఏళ్ల మధ్య వయసు వారు ఉన్నట్లు...