భూమి కోసం.. కలెక్టరేట్ బాట పట్టిన రైతులు
16వ సర్వే నంబర్ సమస్యలపై ‘భూ ప్రహారీ’ పాదయాత్ర.. తహసీల్దార్‌పై చర్యలకు డిమాండ్ ఆమనగల్లు, సెప్టెంబర్ 1 (చైతన్యగళం): కోనాపూర్ గ్రామ రెవెన్యూ పరిధిలోని 16వ సర్వే నంబర్‌లో నెలకొన్న భూ సమస్యలను పరిష్కరించాలని డిమాండ్ చేస్తూ బాధిత రైతులు మంగళవారం ‘భూ ప్రహారీ పాదయాత్ర’ చేపట్టారు. కోనాపూర్ అంబేద్కర్ విగ్రహం నుంచి రంగారెడ్డి జిల్లా కలెక్టరేట్ కార్యాలయం వరకు పాదయాత్ర నిర్వహించారు. అనంతరం జిల్లా రెవెన్యూ అధికారిని కలిసి 16వ సర్వే నంబర్‌కు సంబంధించిన సమస్యలపై రైతుల సమక్షంలో వినతిపత్రం సమర్పించారు. ఈ...