క్రీడా స్ఫూర్తితోనే ఆరోగ్యకర సమాజం
ఖోఖో, టగ్ ఆఫ్ వార్ పోటీలు.. విజేతలకు బహుమతులు ప్రధానం సుల్తానాబాద్, ఆగస్టు 29 (చైతన్యగళం): జాతీయ క్రీడా దినోత్సవాన్ని పురస్కరించుకుని హాకీ మాంత్రికుడు మేజర్ ధ్యాన్‌చంద్ జయంతి సందర్భంగా సుల్తానాబాద్ ఖేల్ ఇండియా సెంటర్‌లో శనివారం ఖోఖో, టగ్ ఆఫ్ వార్ పోటీలను ఉత్సాహంగా నిర్వహించారు. స్పోర్ట్స్ అథారిటీ ఆఫ్ తెలంగాణ ఆదేశాల మేరకు, జిల్లా కలెక్టర్ అనుమతితో జిల్లా యువజన, క్రీడల శాఖ ఆధ్వర్యంలో రెండో రోజు పోటీలు కొనసాగాయి. జిల్లా నలుమూలల నుంచి వచ్చిన క్రీడాకారులు పోటీల్లో పాల్గొని ప్రతిభ...