రాఖీ కట్టిన మహిళలు.. ఆప్యాయంగా పలకరించిన మంత్రి పొన్నం

హుస్నాబాద్, ఆగస్టు 28 (చైతన్యగళం): రాఖీ పౌర్ణమి సందర్భంగా రాష్ట్ర రవాణా, బీసీ సంక్షేమ శాఖ మంత్రి పొన్నం ప్రభాకర్ ఆర్టీసీ బస్సులో ప్రయాణించి మహిళా ప్రయాణికులతో ఆత్మీయంగా ముచ్చటించారు. హుస్నాబాద్ నియోజకవర్గానికి వస్తున్న క్రమంలో పందిళ్ల నుంచి హుస్నాబాద్ బస్‌స్టేషన్ వరకు సాధారణ ప్రయాణికులతో కలిసి బస్సులో ప్రయాణించారు ఈ సందర్భంగా మహిళా ప్రయాణికులు మంత్రికి రాఖీలు కట్టి రాఖీ పౌర్ణమి శుభాకాంక్షలు తెలిపారు. మంత్రి వారితో ఆప్యాయంగా మాట్లాడి ప్రయాణ సౌకర్యాలు, ఎదురవుతున్న సమస్యలను అడిగి తెలుసుకున్నారు పండుగ రోజున విధులు...