ఓటర్ల జాబితా సవరణపై రాజకీయ పార్టీలతో సమావేశం

కరీంనగర్, ఆగస్టు 28 (చైతన్యగళం): ఓటర్ల జాబితా ప్రత్యేక సమగ్ర సవరణ ప్రక్రియపై కరీంనగర్‌ నగరపాలక సంస్థ కమిషనర్‌, ఎన్నికల నమోదు అధికారి ప్రఫుల్‌ దేశాయ్‌ వివిధ రాజకీయ పార్టీల ప్రతినిధులతో సమావేశం నిర్వహించారు. శుక్రవారం నగరపాలక సంస్థ కార్యాలయంలో జరిగిన సమావేశంలో నోటీసులు అందుకున్న ఓటర్లకు సంబంధించిన పరిష్కార ప్రక్రియపై చర్చించారు ఎస్‌ఐఆర్‌ ప్రక్రియలో నోటీసులు జారీ అయిన ఓటర్లు నిర్ణీత గడువులోగా సరైన గుర్తింపు ధ్రువపత్రాలు సమర్పించి తమ వివరాలను సరిచేసుకునేలా రాజకీయ పార్టీల ప్రతినిధులు సహకరించాలని కమిషనర్‌ కోరారు. నోటీసుల...