ఓటర్లకు నోటీసులపై కమిషనర్‌ సమీక్ష

కరీంనగర్, ఆగస్టు 28 (చైతన్యగళం): ఓటర్ల జాబితా ప్రత్యేక సమగ్ర సవరణ రెండో దశలో భాగంగా నోటీసుల పంపిణీ, పరిష్కార ప్రక్రియపై కరీంనగర్‌ నగరపాలక సంస్థ కమిషనర్‌, ఎన్నికల నమోదు అధికారి ప్రఫుల్‌ దేశాయ్‌ సమీక్ష నిర్వహించారు. శుక్రవారం నగరపాలక సంస్థ కార్యాలయంలో బీఎల్‌ఓ సూపర్‌వైజర్లు, తహసీల్దార్లతో సమావేశం నిర్వహించి పలు సూచనలు చేశారు నోటీసుల పంపిణీని రెండు రోజుల్లో పూర్తి చేయాలని ఆదేశించారు. నోటీసులు అందుకున్న ఓటర్లు నిర్ణీత తేదీల్లో అవసరమైన ధ్రువపత్రాలతో హాజరయ్యేలా అవగాహన కల్పించాలని సూచించారు. నోటీసుల పరిష్కారం కోసం...