CHAITHANYAGALAM
Newspaper Banner
Date of Publish : 26 August 2026, 1:12 pm Posted by : rakeshkashaveni12@gmail.com

16వ డివిజన్‌లో ఘనంగా ఇందిరమ్మ గృహప్రవేశం

కరీంనగర్, ఆగస్టు 25 (చైతన్య గళం): కరీంనగర్ నగరంలోని 16వ డివిజన్‌లో డీసీసీ కరీంనగర్ కార్పొరేషన్ అధ్యక్షులు వైద్యుల అంజన్ కుమార్, శ్రీదేవి దంపతుల ఆధ్వర్యంలో ఇందిరమ్మ గృహప్రవేశం, చీరే–సారే అందజేత కార్యక్రమాన్ని ఘనంగా నిర్వహించారు. ఈ సందర్భంగా ఇందిరమ్మ ఇళ్ల పథకం ద్వారా అర్హులైన ప్రతి కుటుంబానికి సొంతింటి కలను సాకారం చేయడమే ప్రజాపాలన ప్రభుత్వ లక్ష్యమని వారు తెలిపారు.కార్యక్రమంలో స్థానిక నాయకులు, కార్యకర్తలు, ప్రజలు, శ్రేయోభిలాషులు పెద్ద సంఖ్యలో పాల్గొని ఇందిరమ్మ ఇంటి లబ్ధిదారుల కుటుంబ సభ్యులకు హృదయపూర్వక శుభాకాంక్షలు తెలిపారు. నూతన గృహంలో సుఖశాంతులు, సంతోషాలు, ఐశ్వర్యం నిండాలని ఆకాంక్షించారు ఈ కార్యక్రమంలో 16వ డివిజన్ కార్పొరేటర్ కాంతాల జగన్ రెడ్డితో పాటు స్థానిక నాయకులు, కార్యకర్తలు పాల్గొన్నారు.