కరీంనగర్, ఆగస్టు 25 (చైతన్య గళం):
వన మహోత్సవంలో భాగంగా కరీంనగర్ ముకరాంపుర ప్రభుత్వ పాఠశాలలో జిల్లా కలెక్టర్ చిత్రా మిశ్రా, పోలీస్ కమిషనర్ గౌష్ ఆలం మంగళవారం మొక్కలు నాటారు. పర్యావరణ పరిరక్షణకు ప్రతి ఒక్కరూ మొక్కలు నాటి వాటిని సంరక్షించాలని వారు సూచించారు పాఠశాల ఆవరణలో మొక్కలు నాటిన అనంతరం వాటి సంరక్షణకు తీసుకోవాల్సిన చర్యలపై అధికారులతో చర్చించారు. విద్యార్థుల్లో పర్యావరణ పరిరక్షణపై అవగాహన కల్పించేందుకు వన మహోత్సవ కార్యక్రమాలు దోహదపడతాయని తెలిపారు. మొక్కలు నాటడంతో పాటు వాటి సంరక్షణకు ప్రతి ఒక్కరూ బాధ్యత తీసుకోవాలని పిలుపునిచ్చారు కార్యక్రమంలో స్థానిక కార్పొరేటర్ పడాల శ్రీజ అజయ్, వన్‌టౌన్, టూటౌన్ ఇన్‌స్పెక్టర్లు రామచందర్‌రావు, సృజన్‌రెడ్డి, విద్యాశాఖ అధికారులు, పాఠశాల సిబ్బంది తదితరులు పాల్గొన్నారు.
