CHAITHANYAGALAM
Newspaper Banner
Date of Publish : 25 August 2026, 10:51 pm Posted by : rakeshkashaveni12@gmail.com

అగ్నిప్రమాదాలపై విద్యార్థులకు అవగాహన

కరీంనగర్, ఆగస్టు 25 (చైతన్యగళం): అగ్నిప్రమాదాల నివారణ, అత్యవసర సమయాల్లో తీసుకోవాల్సిన జాగ్రత్తలపై కరీంనగర్ అగ్నిమాపక సిబ్బంది, రాష్ట్ర విపత్తు స్పందన బృందం ఆధ్వర్యంలో అవగాహన కార్యక్రమం నిర్వహించారు. ట్రినిటీ పాఠశాల విద్యార్థులు, ఉపాధ్యాయులు కరీంనగర్ అగ్నిమాపక కేంద్రాన్ని సందర్శించగా, సిబ్బంది అగ్నిప్రమాదాలు సంభవించినప్పుడు చేపట్టాల్సిన రక్షణ చర్యలను ప్రత్యక్ష ప్రదర్శన ద్వారా వివరించారు. అనంతరం బృందం కరీంనగర్ పట్టణంలోని అపోలో రీచ్ ఆసుపత్రిని సందర్శించి, అక్కడి సిబ్బందికి కూడా అగ్నిప్రమాదాల నివారణ, అత్యవసర పరిస్థితుల్లో వ్యవహరించాల్సిన విధానాలపై అవగాహన కల్పించింది.