పల్లె పల్లెకు పొన్నం – సమస్యలపై అక్కడికక్కడే స్పందన
చిగురుమామిడి, ఆగస్టు 24 (చైతన్యగళం) ప్రజల సమస్యలను నేరుగా తెలుసుకుని పరిష్కరించడమే లక్ష్యంగా రాష్ట్ర రవాణా, బీసీ సంక్షేమ శాఖ మంత్రి పొన్నం ప్రభాకర్ చేపట్టిన ‘పల్లె పల్లెకు పొన్నం అన్న.. పల్లెల్లో ప్రజాపాలన’ కార్యక్రమం చిగురుమామిడి మండలంలో విజయవంతంగా కొనసాగింది. సోమవారం కొండాపూర్, నవాబుపేట, ఇందుర్తి, ఓగులాపూర్, గునుకులపల్లి గ్రామాల్లో మంత్రి పర్యటించి ప్రజలతో మాట్లాడి సమస్యలను తెలుసుకున్నారు. సంబంధిత అధికారులతో మాట్లాడి పలు సమస్యల పరిష్కారానికి ఆదేశాలు జారీ చేశారు కొండాపూర్‌లో మంత్రి మాట్లాడుతూ గౌరవెల్లి ప్రాజెక్టును పూర్తి చేసి హుస్నాబాద్...