గంజాయి అక్రమ రవాణాపై ఉక్కుపాదం
114.196 కిలోల గంజాయి ధ్వంసం.. 25 కేసులకు సంబంధించిన నిందితుల నుంచి స్వాధీనం గడివేముల, ఆగస్టు 24 (చైతన్యగళం): నంద్యాల, కర్నూలు జిల్లాల పరిధిలో నమోదైన 25 కేసులకు సంబంధించి స్వాధీనం చేసుకున్న 114.196 కిలోల గంజాయిని ఎక్సైజ్‌శాఖ అధికారులు ధ్వంసం చేశారు. గడివేముల మండలంలోని బిలకలగూడూరు గ్రామ సమీపంలోని జేఎస్‌డబ్ల్యూ సిమెంట్ ఫ్యాక్టరీ వద్ద ఈ కార్యక్రమాన్ని నిర్వహించారు. ఎక్సైజ్‌శాఖ ఆధ్వర్యంలో, కాలుష్య నియంత్రణ మండలి అధికారుల సమక్షంలో గంజాయిని నిబంధనల ప్రకారం ధ్వంసం చేశారు. డ్రగ్స్ డిస్పోజల్ కమిటీ సభ్యులైన ప్రొహిబిషన్...