CHAITHANYAGALAM
Newspaper Banner
Date of Publish : 23 August 2026, 9:53 pm Posted by : rakeshkashaveni12@gmail.com

విధి నిర్వాహణలో ప్రమాదం విద్యుత్ శాఖ జూనియర్‌ లైన్మెన్‌కు తీవ్ర గాయాలు

మంచిర్యాల, ఆగస్టు 23 (చైతన్యగళం): మంచిర్యాల జిల్లా దండేపల్లి మండలం మోకాసిగూడెం స్టేజి వద్ద ఆదివారం మధ్యాహ్నం విద్యుత్‌ ప్రమాదం చోటుచేసుకుంది. ఈ ఘటనలో జూనియర్‌ లైన్మెన్‌ మహేందర్‌ తీవ్రంగా గాయపడ్డాడు.స్థానికుల కథనం ప్రకారం.. 33 కేవీ విద్యుత్‌ స్తంభాన్ని ఆనుకుని ఉన్న చెట్టు కొమ్మలను తొలగించేందుకు మహేందర్‌ స్తంభం ఎక్కాడు. ఈ క్రమంలో అనుకోకుండా విద్యుత్‌ షాక్‌కు గురై స్తంభంపై నుంచి కిందపడిపోయాడు. ప్రమాదాన్ని గమనించిన స్థానికులు వెంటనే 108 అంబులెన్స్‌కు సమాచారం అందించారు. గాయపడిన మహేందర్‌ను చికిత్స నిమిత్తం లక్షెట్టిపేట ప్రభుత్వ ఆసుపత్రికి తరలించారు. ప్రస్తుతం అతడి పరిస్థితి విషమంగా ఉన్నట్లు సమాచారం. ఘటనపై పోలీసులు కేసు నమోదు చేసి దర్యాప్తు చేపట్టారు.