అర్ధరాత్రి నగరంలో సీపీ ఆకస్మిక తనిఖీలు

కరీంనగర్, ఆగస్టు 23 (చైతన్యగళం): నగరంలో శాంతిభద్రతల పరిరక్షణపై కరీంనగర్ పోలీస్ కమిషనర్ గౌష్ ఆలం ప్రత్యేక దృష్టి సారించారు. శనివారం అర్ధరాత్రి నగరంలో ఆకస్మికంగా పర్యటించిన సీపీ పలు ప్రాంతాల్లో రాత్రి గస్తీ, పోలీసుల అప్రమత్తతను పరిశీలించారు. రాజీవ్ చౌక్, శనివారం మార్కెట్, తెలంగాణ చౌక్‌తో పాటు బైపాస్‌ రోడ్డులోని దాబా ప్రాంతాలను సీపీ తనిఖీ చేశారు. నిర్దేశిత సమయం దాటిన తర్వాత కూడా కొనసాగుతున్న హోటళ్లు, దాబాలు, టీ దుకాణాలు, పాన్‌ దుకాణాల నిర్వాహకులతో మాట్లాడి సమయపాలన పాటించాలని హెచ్చరించారు. నిబంధనలు...