ములుగు, ఆగస్టు 20 (చైతన్య గళం): మహిళలకు ఆర్థిక స్వావలంబన కల్పించేందుకు ‘ఇందిరా మహిళా శక్తి’ పథకం కింద ములుగు మండల కేంద్రంలో మహిళా సంఘాల ఆధ్వర్యంలో పెట్రోల్ బంక్ ఏర్పాటు చేయనున్నట్లు జిల్లా కలెక్టర్ కె. హైమావతి తెలిపారు. గురువారం సాయంత్రం రాజీవ్ రహదారి వెంబడి రైతు వేదిక సమీపంలోని 8 గుంటల ప్రభుత్వ స్థలాన్ని కలెక్టర్ క్షేత్రస్థాయిలో పరిశీలించారు. ఈ స్థలంలో పెట్రోల్ బంక్ ఏర్పాటుకు చర్యలు తీసుకుంటున్నట్లు తెలిపారు. స్వయం సహాయక సంఘాలు, పట్టణ, జిల్లా మహిళా సమాఖ్యల ఆధ్వర్యంలో పెట్రోల్ బంక్ నిర్వహణ కొనసాగుతుందని పేర్కొన్నారు. ఆయిల్ కంపెనీలు, ప్రభుత్వ సహకారంతో మహిళలకు అవసరమైన శిక్షణ అందించి, ఉపాధి అవకాశాలతో పాటు వ్యాపార రంగంలో రాణించేలా పూర్తి సహకారం అందిస్తామని కలెక్టర్ తెలిపారు.
