31వ వార్డులో ఘనంగా బోనాల ఉత్సవాలు

మానుకోట, ఆగస్టు 19(చైతన్యగళం): మానుకోట మున్సిపాలిటీ పరిధిలోని 31వ వార్డులో బోనాల ఉత్సవాలను భక్తిశ్రద్ధలతో ఘనంగా నిర్వహించారు. ఈ వేడుకలకు మున్సిపల్ చైర్‌పర్సన్ జ్యోతి ముఖ్యఅతిథిగా హాజరై అమ్మవారికి ప్రత్యేక పూజలు నిర్వహించారు. ఈ సందర్భంగా మహిళలు సంప్రదాయ దుస్తుల్లో బోనాలను నెత్తిన ఎత్తుకుని అమ్మవారికి సమర్పించారు. భక్తులు అమ్మవారిని దర్శించుకుని మొక్కులు చెల్లించుకున్నారు. బోనాల వేడుకలతో 31వ వార్డులో ఆధ్యాత్మిక సందడి నెలకొంది. ఈ సందర్భంగా చైర్‌పర్సన్ జ్యోతి మాట్లాడుతూ.. బోనాల పండుగ తెలంగాణ సంస్కృతి, సంప్రదాయాలకు ప్రతీకగా నిలుస్తుందని అన్నారు. ప్రజలంతా...