సావర్కర్‌పై ప్రశ్న అడిగిన ఉపాధ్యాయుడి సస్పెన్షన్‌ అన్యాయం

గురు ప్రసాద్‌ సస్పెన్షన్‌ను తక్షణమే ఉపసంహరించాలి: తపస్‌ కరీంనగర్‌, ఆగస్టు 18 (చైతన్యగళం): కేరళ రాష్ట్రంలోని కాసర్‌గోడ్‌ జిల్లా కుంబ్లా సబ్‌ డిస్ట్రిక్ట్‌లో నిర్వహించిన పాఠశాల స్థాయి సోషల్‌ సైన్స్‌ ఫ్రీడమ్‌ క్విజ్‌లో స్వాతంత్ర్య వీర్‌ వినాయక్‌ దామోదర్‌ సావర్కర్‌కు సంబంధించిన ప్రశ్న అడిగినందుకు ఉపాధ్యాయుడు గురు ప్రసాద్‌ను సస్పెండ్‌ చేయడం అన్యాయమని తెలంగాణ ప్రాంత ఉపాధ్యాయ సంఘం (తపస్‌) పేర్కొంది. ఆయన సస్పెన్షన్‌ను తక్షణమే ఉపసంహరించుకోవాలని డిమాండ్‌ చేసింది. ఈ మేరకు తపస్‌ కరీంనగర్‌ జిల్లా శాఖ ఆధ్వర్యంలో జిల్లా అడిషనల్‌ కలెక్టర్‌...