జాతీయ పతాక గౌరవ పరిరక్షణకు చర్యలు తీసుకోవాలి
అధికారులకు స్వామి వివేకానంద గ్రంథాలయ కమిటీ వినతి తూప్రాన్, ఆగస్టు 14 (చైతన్యగళం): స్వాతంత్ర్య దినోత్సవం, గణతంత్ర దినోత్సవం సందర్భంగా జాతీయ పతాక గౌరవాన్ని, పవిత్రతను కాపాడేందుకు తగిన చర్యలు తీసుకోవాలని స్వామి వివేకానంద గ్రంథాలయ కమిటీ, మనోహరాబాద్ ఆధ్వర్యంలో అధికారులను కోరారు. ఈ మేరకు తూప్రాన్ డీఎస్పీ, సీఐ, మనోహరాబాద్ ఎంపీడీవో, గ్రామ పంచాయతీ కార్యదర్శులకు కమిటీ సభ్యులు వినతిపత్రాలు సమర్పించారు. ఈ సందర్భంగా కమిటీ సభ్యులు మాట్లాడుతూ ఆగస్టు 15, జనవరి 26 తేదీల్లో ప్రభుత్వ కార్యాలయాలు, ప్రైవేట్ సంస్థల్లో జాతీయ...