పెద్దపల్లి లో హర్ ఘర్ తిరంగా ర్యాలీ

పెద్దపల్లి, ఆగస్టు 13 (చైతన్య గళం): భారతదేశ 80వ స్వాతంత్ర్య దినోత్సవం సందర్భంగా పెద్దపల్లి పట్టణంలో గురువారం అంగరంగ వైభవంగా హర్ ఘర్ తిరంగా ర్యాలీ నిర్వహించారు. పెద్దపల్లి ప్రభుత్వ జూనియర్ కళాశాల మైదానం నుండి పట్టణ ప్రధాన వీధుల గుండా 500 మీటర్ల పొడవైన జాతీయ జెండాతో ర్యాలీ సాగింది. ఈ ర్యాలీకి ముఖ్య అతిథిగా బీజేపీ రాష్ట్ర అధ్యక్షుడు ఎన్. రామచంద్రరావు హాజరై జాతీయ జెండా ఊపి ర్యాలీని ప్రారంభించారు. విద్యార్థులు, బీజేపీ నాయకులు, కార్యకర్తలు, ప్రజలు పెద్ద ఎత్తున పాల్గొని...