జర్నలిస్టుల సంక్షేమానికి ప్రత్యేక చర్యలు చేపట్టాలి
టీజేఏ సిద్దిపేట జిల్లా సమావేశంలో పలు కీలక తీర్మానాలు సిద్దిపేట, ఆగస్టు 9 (చైతన్యగళం ): జర్నలిస్టుల సంక్షేమం, హక్కుల పరిరక్షణకు ప్రభుత్వం మరింత ప్రాధాన్యత ఇవ్వాలని తెలంగాణ జర్నలిస్ట్ అసోసియేషన్ జిల్లా సమావేశం డిమాండ్ చేసింది. జర్నలిస్టులు ఏళ్లుగా ఎదుర్కొంటున్న సమస్యలకు శాశ్వత పరిష్కారం చూపడంతో పాటు అర్హులైన జర్నలిస్టులకు ప్రభుత్వ సంక్షేమ పథకాలు అందేలా చర్యలు తీసుకోవాలని కోరింది.సిద్దిపేట పట్టణంలోని వైశ్య భవన్‌లో ఎన్‌యూజే ఇండియా జాతీయ ఉపాధ్యక్షులు, టీజేఏ నాయకులు ఉక్కలకర రాజేందర్‌నాథ్ అధ్యక్షతన జిల్లా సమావేశం నిర్వహించారు. టీజేఏ...