కరీంనగర్ , ఆగస్టు 6 (చైతన్యగళం):
మాజీ మేయర్, రాష్ట్ర సివిల్ సప్లయ్స్ కార్పొరేషన్ మాజీ చైర్మన్, 58వ డివిజన్ కార్పొరేటర్ సర్ధార్ రవీందర్ సింగ్ తన జన్మదినం సందర్భంగా బీఆర్‌ఎస్ వర్కింగ్ ప్రెసిడెంట్, మాజీ మంత్రి కేటీఆర్‌ను మర్యాదపూర్వకంగా కలిసి ఆశీస్సులు పొందారు. ఈ సందర్భంగా నగర అభివృద్ధి, ప్రజాసేవలో తన ప్రయాణానికి సంబంధించిన అంశాలను కేటీఆర్‌తో పంచుకున్నారు. మేయర్‌గా పనిచేసిన సమయంలో తాగునీరు, పారిశుధ్యం, రహదారులు, మౌలిక సదుపాయాల కల్పనలో విశేష కృషి చేసిన రవీందర్ సింగ్, ఒక్క రూపాయికే అంత్యక్రియలు, ఒక్క రూపాయికే నల్లా కనెక్షన్ వంటి వినూత్న కార్యక్రమాలతో జాతీయ స్థాయిలో గుర్తింపు పొందారు. విద్య, వైద్యం, రక్తదాన శిబిరాలు, పేదలు, అనాథలు, వృద్ధులు, దివ్యాంగులకు సేవా కార్యక్రమాలను నిరంతరం నిర్వహిస్తున్నారు. ఇటీవల ఆరోసారి కార్పొరేటర్‌గా ఎన్నికైన అనంతరం ‘చేయూత’ పేరుతో సంక్షేమ కార్యక్రమాన్ని ప్రారంభించి పేద కుటుంబాలకు ఆర్థిక సహాయం అందిస్తూ ప్రజాసేవను కొనసాగిస్తున్నారు. ఈ సందర్భంగా కేటీఆర్ సర్ధార్ రవీందర్ సింగ్‌కు జన్మదిన శుభాకాంక్షలు తెలియజేశారు.
