ఆమనగల్లు, జూలై 31 (చైతన్యగళం):
ఎక్సైజ్ సీఐ బద్యనాథ్ చౌహన్ జన్మదిన సందర్భంగా శుక్రవారం ఆయన కార్యాలయంలో ఘనంగా శుభాకాంక్షలు అందజేశారు. మాజీ రాష్ట్ర మిషన్ భగీరథ వైస్ చైర్మన్, ఉప్పల చారిటబుల్ ట్రస్ట్ చైర్మన్ ఉప్పల వెంకటేష్ సీఐ బద్య నాయక్‌ను మర్యాదపూర్వకంగా కలిసి శాలువాతో సత్కరించి జన్మదిన శుభాకాంక్షలు తెలిపారు.
ఈ కార్యక్రమంలో వెంకట్రాంరెడ్డి, తలకొండపల్లి మండల సర్పంచుల సంఘం అధ్యక్షుడు కటికల శేఖర్, మాజీ సర్పంచ్ల సంఘం అధ్యక్షుడు గోపాల్ నాయక్, కల్వకుర్తి తాలూకా గౌడ్ సంఘ కన్వీనర్ మాకురాల అశోక్ గౌడ్, ఆమనగల్ కౌన్సిలర్ ఆంజనేయులు, జగన్, రమేష్, విక్రమ్, శ్రీశైలమ్, ఉప సర్పంచ్ కోటేశ్వర్, కోనాపూర్ శేఖర్, కటికల శేఖర్, వినోద్, అమంగల్ యువకులు, తలకొండపల్లి నాయకులు తదితరులు పాల్గొన్నారు.