Saturday, August 1, 2026
Homeఆంధ్రప్రదేశ్విధుల్లో నిర్లక్ష్యానికి తావివ్వొద్దు – జాయింట్ కలెక్టర్ సూరజ్ ధనుంజయ్

విధుల్లో నిర్లక్ష్యానికి తావివ్వొద్దు – జాయింట్ కలెక్టర్ సూరజ్ ధనుంజయ్

📰 Generate e-Paper Clip

నంద్యాల, జూలై 30 (చైతన్యగళం):
జిల్లా జాయింట్ కలెక్టర్ సూరజ్ ధనుంజయ్ గురువారం ఆత్మకూరు ఆర్డీవో కార్యాలయాన్ని ఆకస్మికంగా సందర్శించారు. కార్యాలయ ఆవరణ, పరిసర ప్రాంతాల పరిశుభ్రతను పరిశీలించి ఎల్లప్పుడూ శుభ్రతను కాపాడాలని సంబంధిత అధికారులను ఆదేశించారు.తరువాత రెవెన్యూ పరిపాలన, రీ-సర్వే పెండింగ్ అంశాలు, ప్రజలకు అందిస్తున్న సేవల పురోగతిపై ఆర్డీవో, తహసీల్దార్లు, ఇతర అధికారులతో సమీక్ష నిర్వహించారు. “ప్రజలకు సంబంధించిన ప్రతి దరఖాస్తు ప్రభుత్వం నిర్దేశించిన గడువులోనే పరిష్కరించాలి. బియాండ్ SLA కేసులు ఏవీ ఉండకూడదు. విధుల్లో నిర్లక్ష్యం, జాప్యానికి తావివ్వొద్దు” అని ఆయన స్పష్టం చేశారు.రీ-సర్వే పెండింగ్ అంశాలను నిర్ణీత గడువులో పూర్తి చేసి, ప్రజలకు వేగవంతమైన, పారదర్శకమైన సేవలు అందించే దిశగా అధికారులు సమన్వయంతో పనిచేయాలని సూచించారు.ఈ సమావేశంలో ఆత్మకూరు ఆర్డీవో వెంకటశివ, రెవెన్యూ శాఖ అధికారులు పాల్గొన్నారు.

RELATED ARTICLES

Most Popular

App Icon

Install CG News App

Add to home screen for faster loading and latest updates.

error: Content is protected !!