Tuesday, September 8, 2026
Homeసంపాదకీయంశ్రీవారి సర్వదర్శనానికి 12–15 గంటలు

శ్రీవారి సర్వదర్శనానికి 12–15 గంటలు

📰 Generate e-Paper Clip

తిరుపతి, జూలై 28(చైతన్యగళం):

తిరుమలలో భక్తుల రద్దీ కొనసాగుతున్నప్పటికీ గతంతో పోలిస్తే స్వల్పంగా తగ్గింది. వైకుంఠం క్యూ కాంప్లెక్స్‌లోని 27 కంపార్ట్‌మెంట్లు భక్తులతో నిండిపోయాయి. టోకెన్లు లేని సర్వదర్శనం భక్తులకు శ్రీవారి దర్శనానికి ప్రస్తుతం సుమారు 12 నుంచి 15 గంటల సమయం పడుతోంది.

జూలై 27, 2026న తిరుమల శ్రీవారిని మొత్తం 80,003 మంది భక్తులు దర్శించుకున్నారు. హుండీ ద్వారా రూ. 4.59 కోట్ల ఆదాయం లభించగా, 32,918 మంది  భక్తులు తలనీలాలు సమర్పించారు. ఆలయం ద్వారా 4.12 లక్షల లడ్డూలు విక్రయించగా, 2.12 లక్షల మంది  భక్తులు అన్నప్రసాదాన్ని స్వీకరించారు. అలాగే 2,613 మంది భక్తులు వైద్య సేవలను పొందారు. ప్రస్తుతం తిరుమలలో భక్తులు తమ ప్రయాణాన్ని దర్శన సమయాన్ని దృష్టిలో ఉంచుకుని ప్రణాళిక చేసుకోవాలని అధికారులు సూచిస్తున్నారు.

 

RELATED ARTICLES
- Advertisment -

Most Popular

App Icon

Install CG News App

Add to home screen for faster loading and latest updates.

error: Content is protected !!