గుండెపోటుతో బీఆర్ఎస్ మాజీ ఎమ్మెల్యే పెద్ది సుదర్శన్ రెడ్డి మృతి

అకస్మాత్తుగా అస్వస్థత.. ఆస్పత్రిలో చికిత్స పొందుతూ కన్నుమూత.. రాజకీయ వర్గాల్లో విషాదం వరంగల్, జూలై 26(చైతన్యగళం): బీఆర్ఎస్ మాజీ ఎమ్మెల్యే, నర్సంపేట మాజీ ప్రజాప్రతినిధి పెద్ది సుదర్శన్ రెడ్డి గుండెపోటుతో ఆదివారం కన్నుమూశారు. అకస్మాత్తుగా అస్వస్థతకు గురైన ఆయనను కుటుంబ సభ్యులు వెంటనే సమీప ఆస్పత్రికి తరలించారు. వైద్యులు అత్యవసర చికిత్స అందించినప్పటికీ ఆయన ప్రాణాలు నిలబెట్టలేకపోయారు. పెద్ది సుదర్శన్ రెడ్డి నర్సంపేట నియోజకవర్గం నుంచి ఎమ్మెల్యేగా సేవలందిస్తూ ప్రజా సమస్యల పరిష్కారానికి కృషి చేశారు. నియోజకవర్గ అభివృద్ధి, పార్టీ బలోపేతం కోసం చురుకుగా పనిచేసిన నాయకుడిగా ఆయనకు ప్రత్యేక గుర్తింపు ఉంది. ఎమ్మెల్యేగా ఉన్న సమయంలో ప్రజలతో సన్నిహిత సంబంధాలు కొనసాగిస్తూ స్థానిక సమస్యలను ప్రభుత్వం దృష్టికి తీసుకెళ్లడంలో కీలక పాత్ర పోషించారు. ఆయన...