Thursday, August 20, 2026
Homeక్రైమ్ న్యూస్నందికొట్కూరులో బోరు వైర్ల చోరీ

నందికొట్కూరులో బోరు వైర్ల చోరీ

📰 Generate e-Paper Clip

నందికొట్కూరు, జూలై 25 (చైతన్యగళం):
నందికొట్కూరు పట్టణంలోని కర్నూల్ రోడ్ బి ఆర్ ఆర్ నగర్ పాలకొమ్మ వద్ద గల మున్సిపాలిటీ బోరులో అమర్చిన 15 హెచ్‌పి మోటార్ వైర్లు, క్లోరిన్ డోజర్ పైపును గుర్తు తెలియని వ్యక్తులు కోసుకొని వెళ్లారు.శనివారం మున్సిపాలిటీ సిబ్బంది ఈ విషయాన్ని గమనించి వెంటనే మున్సిపల్ కమిషనర్ వెంకట్రామిరెడ్డి, మున్సిపల్ డి.ఈ. దృష్టికి తీసుకువెళ్లారు. అనంతరం మున్సిపల్ ఏఈ దినేష్ కొత్త వైర్లను ఏర్పాటు చేసి కాలనీ ప్రజలకు తాగునీటి సమస్యను పరిష్కరించారు.తరువాత మున్సిపాలిటీ అధికారులు ఈ ఘటనను సిఐ అశోక్ కుమార్కు తెలియజేశారు. చోరీకి పాల్పడిన వారిని గుర్తించి కఠిన చర్యలు తీసుకుంటామని ఆయన స్పష్టం చేశారు.

RELATED ARTICLES
- Advertisment -

Most Popular

App Icon

Install CG News App

Add to home screen for faster loading and latest updates.

error: Content is protected !!