Wednesday, September 2, 2026
Homeసంపాదకీయంనీట్ పేపర్ లీకేజీపై నిరసన – ఇబ్రహీంపట్నంలో రాస్తారోకో

నీట్ పేపర్ లీకేజీపై నిరసన – ఇబ్రహీంపట్నంలో రాస్తారోకో

📰 Generate e-Paper Clip

రంగారెడ్డి, జూలై 22 (చైతన్యగళం‌): నీట్ పేపర్ లీకేజీ విషయంలో కేంద్ర ప్రభుత్వ వైఖరిని నిరసిస్తూ ఢిల్లీలో ప్రధాని నివాసం ముందు ఆందోళన చేస్తున్న కాంగ్రెస్ అగ్రనేతలు రాహుల్ గాంధీ, ప్రియాంక గాంధీపై జరిగిన దాడిని ఖండిస్తూ రంగారెడ్డి జిల్లా ఇబ్రహీంపట్నం సాగర్ హైవేపై కాంగ్రెస్ శ్రేణులు రాస్తారోకో నిర్వహించారు.

ఈ కార్యక్రమానికి ఎమ్మెల్యే మల్ రెడ్డి రంగారెడ్డి ఆధ్వర్యం వహించారు. నిరసనలో భాగంగా కేంద్ర ప్రభుత్వ దిష్టిబొమ్మను దగ్ధం చేశారు.

ఈ ఆందోళనలో గడ్డి అన్నారం మార్కెట్ కమిటీ చైర్మన్ చిలుక మధుసూదన్ రెడ్డి, రాష్ట్ర కాంగ్రెస్ పార్టీ యువజన విభాగం నాయకులు బాలశివుడు గౌడ్, మున్సిపల్ అధ్యక్షులు మహమ్మద్ గౌస్, మున్సిపల్ కౌన్సిలర్లు నీళ్ల భాను గౌడ్, దారు రాఘవేంద్రరావు, ఎన్‌ఎస్‌యూఐ నియోజకవర్గ అధ్యక్షులు నందకిషోర్, అయాన్ పటేల్ తదితరులు పాల్గొన్నారు.

ఈ నిరసనతో సాగర్ హైవేపై కొంతసేపు వాహనాల రాకపోకలు అంతరాయం కలిగాయి. కాంగ్రెస్ నాయకులు విద్యార్థుల సమస్యలపై కేంద్రం తక్షణ చర్యలు తీసుకోవాలని డిమాండ్ చేశారు.

RELATED ARTICLES
- Advertisment -

Most Popular

App Icon

Install CG News App

Add to home screen for faster loading and latest updates.

error: Content is protected !!