Tuesday, September 1, 2026
Homeసంపాదకీయంతిరుమలలో భక్తుల రద్దీ.. శ్రీవారి దర్శనానికి 15–18 గంటల నిరీక్షణ

తిరుమలలో భక్తుల రద్దీ.. శ్రీవారి దర్శనానికి 15–18 గంటల నిరీక్షణ

📰 Generate e-Paper Clip

తిరుమల, జూలై 22(చైతన్యగళం) :

తిరుమలలో శ్రీవారి దర్శనం కోసం భక్తుల రద్దీ భారీగా కొనసాగుతోంది. వైకుంఠం క్యూ కాంప్లెక్స్‌లోని అన్ని కంపార్ట్‌మెంట్లు పూర్తిగా నిండిపోగా, ఉచిత సర్వదర్శనం క్యూ లైన్లు శిలాతోరణం వరకు విస్తరించాయి. టోకెన్లు లేని సర్వదర్శనం భక్తులకు స్వామివారి దర్శనానికి సుమారు 15 నుంచి 18 గంటల సమయం పడుతోంది.

జూలై 21న మొత్తం 82,105 మంది భక్తులు శ్రీవారిని దర్శించుకున్నారు. హుండీ ద్వారా రూ.5.18 కోట్ల ఆదాయం సమకూరింది. కల్యాణకట్టలో 34,484 మంది భక్తులు తలనీలాలు సమర్పించారు. అదేరోజు 4.17 లక్షల లడ్డూలను టీటీడీ విక్రయించింది. ఉచిత అన్నప్రసాదాన్ని 2.60 లక్షల మంది భక్తులు స్వీకరించగా, 3,790 మందికి ఉచిత వైద్య సేవలు అందించినట్లు టీటీడీ అధికారులు తెలిపారు.

RELATED ARTICLES
- Advertisment -

Most Popular

App Icon

Install CG News App

Add to home screen for faster loading and latest updates.

error: Content is protected !!