Thursday, August 20, 2026
Homeతెలంగాణరాజన్న సిరిసిల్లలో బీజేపీ నూతన కమిటీ నియామకం

రాజన్న సిరిసిల్లలో బీజేపీ నూతన కమిటీ నియామకం

📰 Generate e-Paper Clip

రాజన్న సిరిసిల్ల, జూలై 20 (చైతన్యగళం):
భారతీయ జనతా పార్టీ తెలంగాణ రాష్ట్ర అధ్యక్షుడు ఎం. రామచంద్రరావు ఆదేశాల మేరకు, రాష్ట్రంలోని వివిధ మోర్చాల అధ్యక్షులు రాజన్న సిరిసిల్ల జిల్లాకు నూతన జిల్లా మోర్చా అధ్యక్షులను నియమించారు.

ఈ సందర్భంగా జిల్లా అధ్యక్షుడు రెడ్డబోయిన గోపి నూతనంగా బాధ్యతలు స్వీకరించిన మోర్చా అధ్యక్షులందరికీ హృదయపూర్వక శుభాకాంక్షలు తెలియజేస్తూ, పార్టీ బలోపేతానికి సమష్టిగా కృషి చేయాలని ఆకాంక్షించారు. ఆయన మాట్లాడుతూ, రానున్న రోజుల్లో ప్రజా సమస్యలపై నిరంతరం పోరాడుతూ, ఆయా మోర్చాల ద్వారా ప్రతి కార్యకర్తను, ప్రతి కుటుంబాన్ని చేరుకోవాలని సూచించారు. ప్రజల సమస్యల పరిష్కారమే లక్ష్యంగా సేవాభావంతో పనిచేస్తూ పార్టీని మరింత బలోపేతం చేయాలని పిలుపునిచ్చారు.

నూతనంగా నియమితులైన వారు: బీజేవైఎం జిల్లా అధ్యక్షుడు రాగుల రాజిరెడ్డి, ఓబీసీ మోర్చా జిల్లా అధ్యక్షుడు రేగుల సంతోష్ బాబు, కిసాన్ మోర్చా జిల్లా అధ్యక్షుడు అన్నాడి జిలపతి రెడ్డి, మహిళా మోర్చా జిల్లా అధ్యక్షురాలు పల్లం అన్నపూర్ణ, ఎస్సీ మోర్చా జిల్లా అధ్యక్షుడు ఉడుగుల యాదగిరి, ఎస్టీ మోర్చా జిల్లా అధ్యక్షుడు కిరణ్ నాయక్.

జిల్లా అధ్యక్షుడు రెడ్డబోయిన గోపి మాట్లాడుతూ, రాజన్న సిరిసిల్ల జిల్లాలోని సిరిసిల్ల, వేములవాడ నియోజకవర్గాల్లో బీజేపీ విజయమే లక్ష్యం అని, బూత్ స్థాయి నుంచి పార్టీని బలోపేతం చేస్తూ ప్రజల విశ్వాసాన్ని సంపాదించి రానున్న ఎన్నికల్లో రెండు స్థానాల్లోనూ బీజేపీ జెండా ఎగరవేయడమే మన సంకల్పమని స్పష్టం చేశారు.

RELATED ARTICLES
- Advertisment -

Most Popular

App Icon

Install CG News App

Add to home screen for faster loading and latest updates.

error: Content is protected !!