రైతు కమిషన్ కార్యాలయాన్ని సందర్శించిన ఎక్స్‌పర్ట్ కమిటీ చైర్మన్ డాక్టర్ జి. చిన్నారెడ్డి
హైదరాబాద్(చైతన్యగళం): రాష్ట్రంలో ఎల్ నినో ప్రభావం, వర్షాభావ పరిస్థితుల నేపథ్యంలో ప్రభుత్వం ఇటీవల ఏర్పాటు చేసిన నిపుణుల కమిటీ చైర్మన్ డాక్టర్ జి. చిన్నారెడ్డి సోమవారం బీఆర్కే భవన్‌లోని రైతు కమిషన్ కార్యాలయాన్ని సందర్శించారు. ఈ సందర్భంగా రైతు కమిషన్ బృందంతో ఆయన దాదాపు గంటకు పైగా సమావేశమై రాష్ట్రంలోని ప్రస్తుత వ్యవసాయ పరిస్థితులు, రైతులు ఎదుర్కొంటున్న సమస్యలపై విస్తృతంగా చర్చించారు. ఎల్ నినో ప్రభావంతో ఏర్పడిన పరిస్థితులను అధ్యయనం చేసి ప్రభుత్వానికి తగిన సూచనలు అందించేందుకు డాక్టర్ జి. చిన్నారెడ్డి అధ్యక్షతన నిపుణుల...