Thursday, August 20, 2026
Homeతెలంగాణసిద్ధిపేటవర్షాలు కురవాలని పోచమ్మ తల్లి, ఆంజనేయస్వామికి జలాభిషేకాలు

వర్షాలు కురవాలని పోచమ్మ తల్లి, ఆంజనేయస్వామికి జలాభిషేకాలు

📰 Generate e-Paper Clip

హుస్నాబాద్, జూలై 15 (చైతన్య గళం): 

జిల్లాలో వర్షాభావ పరిస్థితులు నెలకొని, రైతులు వ్యవసాయ పనులు ప్రారంభించలేక ఇబ్బందులు పడుతున్న నేపథ్యంలో హుస్నాబాద్ పట్టణంలోని 5వ వార్డులో గ్రామదేవత పోచమ్మ తల్లి, ఆంజనేయస్వామికి ప్రత్యేక పూజలు, జలాభిషేకాలు నిర్వహించారు.

5వ వార్డు కౌన్సిలర్ బొలిశెట్టి రాజు, మున్సిపల్ చైర్‌పర్సన్ దండి లక్ష్మి, వైస్ చైర్‌పర్సన్ చిత్తారి పద్మ ఆధ్వర్యంలో నిర్వహించిన ఈ కార్యక్రమంలో వార్డు ప్రజలు పెద్ద సంఖ్యలో పాల్గొని భక్తిశ్రద్ధలతో పూజలు చేశారు.

ఈ సందర్భంగా సకాలంలో సమృద్ధిగా వర్షాలు కురిసి, పాడి పంటలు బాగా పండాలని, కరువు పరిస్థితులు తొలగి రైతులకు మంచి దిగుబడులు రావాలని భక్తులు ప్రత్యేక ప్రార్థనలు చేశారు.

RELATED ARTICLES
- Advertisment -

Most Popular

App Icon

Install CG News App

Add to home screen for faster loading and latest updates.

error: Content is protected !!