Thursday, September 10, 2026
Homeసంపాదకీయంప్రధాని మోదీకి ఇండోనేసియా అత్యున్నత పౌర పురస్కారం

ప్రధాని మోదీకి ఇండోనేసియా అత్యున్నత పౌర పురస్కారం

📰 Generate e-Paper Clip

భారత ప్రధాని నరేంద్ర మోదీకి అంతర్జాతీయ వేదికపై మరో అరుదైన గౌరవం దక్కింది. ఇండోనేసియా దేశం తమ అత్యున్నత పౌర పురస్కారమైన ‘బింటాంగ్ ఆదిపూర్ణ రిపబ్లిక్ ఆఫ్ ఇండోనేసియా’ అవార్డును ప్రధాని మోదీకి ప్రకటించింది.

న్యూఢిల్లీ, జులై 7(చైతన్యగళం): భారత ప్రధాని నరేంద్ర మోదీకి అంతర్జాతీయ వేదికపై మరో అరుదైన గౌరవం దక్కింది. ఇండోనేసియా దేశం తమ అత్యున్నత పౌర పురస్కారమైన ‘బింటాంగ్ ఆదిపూర్ణ రిపబ్లిక్ ఆఫ్ ఇండోనేసియా’ (Bintang Adipurna Republic of Indonesia) అవార్డును ప్రధాని మోదీకి ప్రకటించింది. ఇరు దేశాల మధ్య దౌత్య, ఆర్థిక, ద్వైపాక్షిక సంబంధాలను బలోపేతం చేయడంలో మోదీ అందించిన విశేష కృషికి గుర్తింపుగా ఇండోనేసియా ప్రభుత్వం ఈ నిర్ణయం తీసుకుంది.

ఇండోనేసియా అధ్యక్షుడు ప్రబోవో సుబియాంతో (Prabowo Subianto) ఈ అత్యున్నత పురస్కారాన్ని అధికారికంగా ప్రకటించారు. భారత్-ఇండోనేసియా దేశాల మధ్య చారిత్రక బంధాన్ని కొత్త శిఖరాలకు చేర్చడంలో ప్రధాని మోదీ పోషించిన పాత్రను ఈ సందర్భంగా ఆయన కొనియాడారు. గ్లోబల్ సౌత్ (అభివృద్ధి చెందుతున్న దేశాల) ప్రయోజనాల కోసం, ఆసియా-పసిఫిక్ ప్రాంతంలో శాంతి భద్రతల కోసం భారత్ అందిస్తున్న సహకారం అమోఘమైనదని ఆయన ప్రశంసించారు.

RELATED ARTICLES
- Advertisment -

Most Popular

App Icon

Install CG News App

Add to home screen for faster loading and latest updates.

error: Content is protected !!