కల్వకుర్తి, జులై 02(చైతన్యగళం): ప్రభుత్వ జూనియర్ కాలేజీ కల్వకుర్తి నందు విద్యా స్వేచ్ఛ ఫౌండేషన్ వారి ఆధ్వర్యంలో ఇంటర్మీడియట్లో అత్యధిక మార్కులు సాధించిన విద్యార్థులకు గురువారం సన్మానం చేయడం జరిగింది. ఎంపీసీ సెకండ్ ఇయర్ లో 971 మార్కులతో జిల్లా మొదటి ర్యాంకు సాధించిన స్పందన శ్రీశైలం,నందిని,సతీష్ లను సన్మానించి అవార్డులు బహుమతులు బంగారు పతకాలను అందించడం జరిగింది, వచ్చే సంవత్సరం 975 మార్కులు సాధించే విద్యార్థులను ఫ్లైట్లో మా సొంత టికెట్లతో విహారయాత్రకు తీసుకెళ్తామని విద్యార్థులలో స్ఫూర్తిని నింపారు గ్రామీణ ప్రాంత విద్యార్థులు మెరుగైన ఫలితాలను సాధించడం అద్భుతం అని కళాశాల సిబ్బంది ప్రిన్సిపాల్ ప్రణాళిక బద్ధమైనటువంటి కృషి ఫలితంగా ఉత్తమ ఫలితాలు సాధించడం సాధ్యమవుతుందని ఫౌండేషన్ చైర్మన్ వాసుదేవరావు కొనియాడారు.ఈ కార్యక్రమంలో అత్యధిక మార్కులు సాధించిన విద్యార్థులతో పాటు కళాశాల ప్రిన్సిపల్ శ్రీ రామ్ రెడ్డి విద్యా స్వేచ్ఛ ఫౌండేషన్ చైర్మన్ వాసుదేవరావు, వైస్ చైర్మన్ శేషగిరిరావు, మహిళా చైర్మన్ శ్రీమతి నిర్మల మరియు అధ్యాపక బృందం అదేవిధంగా కళాశాల విద్యార్థిని విద్యార్థులు పాల్గొన్నారు.
