ఓటర్ల జాబితా నుంచి మరణించిన వారి పేర్లు, డూప్లికేట్, వలస వెళ్ళిన ఓట్లను తొలగించి. ఓటర్ల జాబితాలో పారదర్శకతను తీసుకొచ్చేందుకు కేంద్ర ఎన్నికల సంఘం చేపట్టిన ఎస్‌ఐఆర్ సర్వే ఇప్పుడు తెలంగాణలో కూడా షురువైంది. ఇవాళ్టి నుంచి రాష్ట్రవ్యాప్తంగా ఈ సర్వే ప్రారంభం కానుంది. ఇంతకూ సర్వే ఎలా జరుగుతుంది. ఎప్పటి వరకు జరుగుతుందో తెలుసుకుందాం పదండి.
ఉత్తరాది రాష్ట్రాల్లో ఇప్పటికే పూర్తైన ఓటర్ల జాబితా ప్రత్యేక సమగ్ర సవరణ (ఎస్ఐఆర్) ఇప్పుడు తెలంగాణకు కూడా వచ్చేసింది. గురువారం నుంచే తెలంగాణ రాష్ట్ర వ్యాప్తంగా ఎస్ఐఆర్ ప్రక్రియ ప్రారంభం కానుంది. నేటి నుండి జూలై 24 వరకు ఈ ప్రక్రియ కొనసాగనుంది. ఇక సర్వేకు అవసరమైన ఏర్పాట్లు అన్నింటిని ఇప్పటకే పూర్తి చేవారు అధికారులు. ఈ సర్వేలో భాగంగా ఒక్కో ఓటర్‌కు రెండు ఎన్యూమరేషన్ పత్రాలను అందించి వివరాలు సేకరిస్తారు. అయితే హైదరాబాద్ పరిధిలోపి ఓటర్లకు ఇంగ్లీష్ పత్రాలను ఇవ్వనుండగా, మిగతా అన్ని జిల్లాల్లో తెలుగులో ఉన్న పత్రాలను అంంచనున్నారు బిఎల్ఓలు.
ఈ ప్రక్రియలో భాగంగా బీఎల్‌ఓలు రోజుకూ ఒక్కో బూత్ పరిధితోని సుమారు 50 ఇళ్లకు వెళ్లి అక్కడి ఓటర్లకు ఎమ్యూనరేషన్ పత్రాలను అందజేయాల్సి ఉంటుంది. ఇలా రాష్ట్రవ్యాప్తంగా ఉన్న మొత్తం 3,38,29,018 మంది ఓటర్లకు ఎన్యూమరేషన్ పత్రాలను బిఎల్ఓలు అందించనున్నారు. అయితే ఈ పత్రాలు అందుకున్న ఓటర్లు వాటిని క్షుణ్నంగా పరీశిలించి దాని పూర్తి చేసి మళ్లీ ఈ వచ్చే నెల 24 లోపు బీఎల్‌వోలకు తిరిగి అందిచాల్సి ఉంటుంది. ఈ ఫామ్‌ను ఎలా నింపాలి అని తెలియక పెతే.. ఇందుకు సంబంధించి బీఎల్‌వోలు మీకూ వివరణ ఇస్తారు.
ఈ ప్రక్రియ ఎలా కొనసాగుతుంది.. ఫామ్ ఎలా నింపాలి.
ఈ ప్రక్రియలో భాగంగా ఒక్కో బీఎల్‌వోలు ఓటర్లకు రెండు ఎన్యూమరేషన్ ఫామ్స్ ఇస్తారు. వాటిని ఎలా నింపాలో చెబుతారు. ఫామ్ ఫిల్ చేసిన తర్వాత ఒకటి వాళ్లు తీసుకొని ఇంకో ఫామ్‌ను రషీదు రూపంలో మీకే ఇస్తారు
అన్‌లైన్‌లో ఇలా
ఈ ఎమ్యూనరేషన్‌ను మీరు ఆన్‌లైన్‌లో కూడా చేసుకోవచ్చు. ఒక వేళ మీరు ఆన్‌లైన్‌లోనే ఫామ్ ఫిల్ చేయాలి అనుకుంటే ఎన్నికల సంఘం అధికారిక వెబ్‌సైట్ https:voters.eci.gov.in లోకి వెళ్లి ఎపిక్ కార్డు నంబర్‌తో లాగిన్ అయి అక్కడ ఫామ్‌ను ఫిల్ చేసి సబ్‌మిట్ చేయాల్సి ఉంటుంది. అయితే ఓటర్ కార్డు, ఆధార్ కార్డులో ఒకే నేమ్ ఉన్నవారికి మాత్రమే ఇది వర్తిస్తుంది. ఒక వేళ మీకు ఎమ్యూనరేషన్ ఫామ్ ఫిల్ చేయడం ఏవైనా సందేహాలు ఉన్నా, ఒక వేళ మీ ఇంటికి బీఎల్‌వో రాకపోయినా మీరు 1950 టోల్‌ఫ్రీ నంబరుకు ఫోన్ చేసి సమాచారం ఇవ్వొచ్చు.
