Wednesday, June 24, 2026
Homeతెలంగాణహరిత గ్రామం – సుస్థిర భవిష్యత్తుకు తొలి అడుగు

హరిత గ్రామం – సుస్థిర భవిష్యత్తుకు తొలి అడుగు

📰 Generate e-Paper Clip

మర్రిగూడ, జూన్ 19 (చైతన్యగళం): మర్రిగూడ మండలంలోని ఖుదాబక్ష్‌పల్లి గ్రామపంచాయతీ పరిధిలో గ్రామసభ విజయవంతంగా నిర్వహించబడింది. అనంతరం గ్రామ సర్పంచ్ శ్రీమతి పందుల జయలక్ష్మి అధ్యక్షతన వనమహోత్సవ కార్యక్రమం ఘనంగా ప్రారంభమైంది.

ఈ కార్యక్రమానికి ముఖ్య అతిథులుగా డిప్యూటీ కలెక్టర్ (ట్రైనీ) శ్రీ వెంకటేశ్వర్లు, మండల ఎంపీడీవో జి.సి. మునయ్య, మండల ఎంపీఓ బి. రవికుమార్, ఈసీ వివేక్ సాగర్ హాజరై మొక్కలు నాటి, పర్యావరణ పరిరక్షణపై ప్రజలకు అవగాహన కల్పించారు.

గ్రామ సర్పంచ్ జయలక్ష్మి, ఉప సర్పంచ్ షేక్ షబ్బీర్, పాలకవర్గ సభ్యులు, పంచాయతీ కార్యదర్శి ప్రసన్న బాబు, గ్రామాధికారులు, ఉపాధ్యాయులు, గ్రామ ప్రజల భాగస్వామ్యంతో కార్యక్రమం విజయవంతమైంది.

“ఒక్క మొక్క నేటి అవసరం కాదు… రేపటి తరాల భవిష్యత్తుకు మనం ఇచ్చే అమూల్యమైన కానుక” అని సందేశం ఇచ్చారు.

పచ్చని ఖుదాబక్ష్‌పల్లి నిర్మాణానికి ప్రతి ఒక్కరూ ముందుకు రావాలని, మొక్కలను నాటి సంరక్షించి పర్యావరణ పరిరక్షణలో భాగస్వాములు కావాలని పిలుపునిచ్చారు.

RELATED ARTICLES

Most Popular

App Icon

Install CG News App

Add to home screen for faster loading and latest updates.

error: Content is protected !!